శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 01:45:35

కరోనా కాలంలో ఐకేపీ సేవలు భేష్‌

కరోనా కాలంలో ఐకేపీ సేవలు భేష్‌

కమ్మర్‌పల్లి: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో ఐకేపీ సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి ఏపీఎం కుంట గంగాధర్‌, హాసాకొత్తూర్‌లోని మహిళా సంఘం సభ్యురాలు లావణ్యతో జూమ్‌ యాప్‌ ద్వారా కవిత మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల మంది మహిళలు సంఘాల్లో ఉన్నారని, కరోనా సమయంలో మహిళలకు రూ.2,600 కోట్ల రుణాలను అందించారని, ఈ క్రమంలో ఐకేపీ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. రుణాల పంపిణీలో రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా టాప్‌లో నిలవడం, జిల్లాలో కమ్మర్‌పల్లి మొదటి స్థానంలో ఉండటంతో ఏపీఎంను కవిత అభినందించారు. 


logo