సోమవారం 01 జూన్ 2020
Telangana - May 12, 2020 , 11:34:33

మామిడి కొనుగోళ్లకు ఐకేపీ కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి

మామిడి కొనుగోళ్లకు ఐకేపీ కేంద్రాలు: మంత్రి ఎర్రబెల్లి

జనగామ: మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, మహిళా శక్తి అమూల్యమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జనగామ జిల్లా పెద్దపహాడ్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులోనూ, కరోనా నివారణలో భాగంగా మాస్కుల తయారీలో పాలుపంచుకోవడంతోపాటు, ఇప్పుడు మామిడి కొనుగోళ్లలోనూ మహిళా సంఘాలు ముందున్నాయని తెలిపారు. మొత్తం మూడు వేల మెట్రిక్‌ టన్నుల లక్ష్యంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఐకేపీ మామిడి కొనుగోలు చేయనుందని, దీనికోసం రాష్ట్రంలో 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఖమ్మం, నాగర్‌కర్నూలు, సిద్దిపేట, వికారాబాద్‌, జగిత్యాలలో కొనుగోలుకేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. మంచిర్యాల, సూర్యాపేటలో ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 300 మెట్రిక్‌ టన్నుల మామిడికాయలు కొనుగోలు చేశామన్నారు. మామిడి కాయలతోపాటు, పుచ్చ, అరటి, పొప్పడి పండ్లను కొనుగోలు చేస్తున్నామని, వీటిని సహజంగా పండించి మార్కెటింగ్‌ చేస్తున్నామని అన్నారు.


logo