శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:45:38

అర్బన్‌ షెల్టర్‌ హోంలకు ఐకియా సాయం

అర్బన్‌ షెల్టర్‌ హోంలకు ఐకియా సాయం

  • మంత్రి కేటీఆర్‌కు రూ.20 లక్షల విలువైన సామగ్రి అంగీకారపత్రాల అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభ సమయంలో పేదలను ఆదుకోవడానికి ఐకియా సంస్థ ముందుకొచ్చింది. శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను సీఐఐ ఆధ్వర్యంలో ఐకియా ప్రతినిధులు కలిశారు. మెప్మా ఆధ్వర్యంలో నడిచే అర్బన్‌ షెల్టర్‌ హోంలకు, స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు సంరక్షణ కేంద్రాలకు రూ.20 లక్షల విలువైన బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు, స్టీల్‌ సామగ్రి, బొమ్మలు వంటివి అందించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన అంగీకారపత్రాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఐకియా సంస్థ ప్రతినిధులను కేటీఆర్‌ అభినందించారు. మంత్రిని కలిసినవారిలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఐఐ వైస్‌ చైర్మన్‌ సమీర్‌గోయల్‌, సీఐఐ డైరెక్టర్‌ సుబహజిత్‌ సహా, ఐకియా స్టోర్‌మేనేజర్‌ అరులీ ఉన్నారు.logo