హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనాపై పోరుకు ఐఐటీలు తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వాడి వైరస్‌ను కట్టడిచేసేందుకు మాస్కుల నుంచి టెస్ట్ కిట్ల దాకా, శానిటైజర్ల నుంచి వైద్యపరికరాల దాకా మొత్తం 271 ఆవిష్కరణలుచేశాయి. మేలైన, రక్షణ కల్పించే మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను తయారుచేశాయి. అటు పర్యావరణానికి మేలుచేసేవాటిని రూపొందిస్తూనే, కరోనా నుంచి రక్షణకు ప్రాధాన్యమిస్తున్నాయి. తక్కువ సమయంలో వైరస్‌ను గుర్తించే శాండ్విచ్ ఎలిసా టెస్ట్ కిట్, ఇమ్యూనోడయాగ్నిస్టిక్ కిట్, ఆటోమేటెడ్ వెంటిలేటర్, రొబోటిక్ యంత్రాలు తదిత రాలను ఐఐటీలు అభివృద్ధి చేశాయి. కొన్ని ఐఐటీలు వైరస్‌పై విస్తృతమైన పరిశోధనలు సాగిస్తున్నాయి.