e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home తెలంగాణ చెట్ల గణనకు ఏఐ టెక్నాలజీ

చెట్ల గణనకు ఏఐ టెక్నాలజీ

  • సరికొత్త యంత్రాన్ని రూపొందించిన ఐఐఐటీహెచ్‌ శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌, జూలై 3(నమస్తే తెలంగాణ): ఓ ప్రాంతం లో ఉన్న చెట్లను ఉపగ్రహ చిత్రాలు లేదా డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోల ఆధారంగా లెక్కగడతారు. కానీ, ఎత్తయిన భవనాలున్న పట్టణాల్లో ఈ లెక్కింపు ప్రయాసగా మారుతున్నది. ఈ సమస్యకు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐఐటీహెచ్‌) పరిష్కారం చూపింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీతో స్వతహాగా చెట్లను లెక్కించే యం త్రాన్ని రూ పొందించింది. సెంటర్‌ ఫర్‌ విజువల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (సీవీఐటీ) ప్రొఫెసర్‌ సీవీ జవహార్‌ మార్గదర్శకత్వంలో ప్రొఫెసర్‌ అర్పిత్‌ బహేటి ఈ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. బైక్‌పై ఈ యంత్రాన్ని తీసుకెళ్తే అందులోని వీడి యో క్యాప్చర్‌ వ్యవస్థ ఆ రహదారి వెంట ఉన్న కొమ్మలను గుర్తించి చెట్లను లెక్కిస్తుంది. హైదరాబాద్‌, సూరత్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించగా 83 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని ఐఐఐటీహెచ్‌ కో-ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ లోకనాథన్‌ వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana