బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 14:45:33

రెవెన్యూ శాఖలో రాణించాలంటే.. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

రెవెన్యూ శాఖలో రాణించాలంటే.. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

మహబూబ్ నగర్ : రెవెన్యూ శాఖలో రాణించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు చెప్పారు. నూతనంగా ఎంపికైన 32 మంది డిప్యూటీ తాసిల్దార్లతో ఆయన శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. రెవెన్యూ శాఖకు ఎంతో చరిత్ర ఉందని, ముఖ్యంగా బ్రిటిష్, నిజాం కాలంలో  రెవెన్యూకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండేవని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు రెవెన్యూ శాఖ ద్వారా సాధ్యం అవుతుందన్నారు.


 రెవెన్యూ శాఖ పై వస్తున్న పలు అపోహలను తొలగించాల్సిన బాధ్యత నూతనంగా ఎంపికైన రెవెన్యూ ఉద్యోగుల పై ఉందని ఆయన తెలిపారు. భూమి రికార్డుల నవీకరణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డిఆర్వో  స్వర్ణలత, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కిష్టన్న, రాజేష్ రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.logo