e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home తెలంగాణ చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది

చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది

  • వాట్సాప్‌ నంబరు +918046163838
చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది

హైదరాబాద్‌, జూన్‌ 13 (నమస్తే తెలంగాణ): ఛాతిభాగంలో తీసిన ఎక్స్‌రేను వాట్సాప్‌ చేస్తే 10-15 నిమిషాల్లో కరోనా ఉందో లేదో చెప్పే సరికొత్త పద్ధతిని బెంగళూరుకు చెందిన ఆర్ట్‌పార్క్‌ రూపొందించింది. ఆర్టీపీసీఆర్‌, సీటీస్కాన్‌ అందుబాటులో లేని చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతవాసులకు ఉపయోగకరంగా ఉండేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో వాట్సాప్‌ ఆధారిత ఆవిష్కరణ చేసింది. పూర్తి ఉచితంగా ఈ ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఆవిష్కర్తలు తెలిపారు. ఆర్ట్‌పార్క్‌ సీఈవో ఉమాకాంత్‌సోని దీని గురించి మాట్లాడుతూ.. డాక్టర్‌ లేదా రేడియాలజిస్ట్‌ చెస్ట్‌ ఎక్స్‌రేను వాట్సాప్‌ బోట్‌ ఆఫ్‌ ఎక్స్‌రే సేతులో అప్‌లోడ్‌ చేస్తే దాన్ని పరిశీలించి 10 నుంచి 15 నిమిషాల్లో రిపోర్టును జనరేట్‌ చేస్తుందని చెప్పారు. స్టార్టప్‌ కంపెనీ నిరమయ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)తో కలిసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఏ డాక్టరైనా www.xraysetu.com వెబ్‌సైట్‌ను సందర్శించి ట్రై డి ఫ్రీ ఎక్స్‌-రే సేతు బీటా అనే ఆప్షన్‌నుఎంచుకోవాలి. ఓపెన్‌ అయ్యే పేజీలో వెబ్‌ లేదా వాట్సాప్‌ ఆధారిత చాట్‌బోట్‌ ద్వారా +918046163838 నంబరుకు వాట్సాప్‌ చేసి సేవలను పొందవచ్చు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది
చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది
చెస్ట్‌ ఎక్స్‌రే వాట్సాప్‌ చేస్తే..కరోనా ఉందో లేదో చెప్పేస్తది

ట్రెండింగ్‌

Advertisement