గురువారం 28 మే 2020
Telangana - May 15, 2020 , 12:18:35

మాస్క్‌ లేకుంటే కేసు: ఎస్పీ కోటిరెడ్డి

మాస్క్‌ లేకుంటే కేసు: ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్‌: కరోనా మహమ్మారిని మహబూబాబాద్‌ జిల్లాలో అడుగుపెట్టనీయకుండా ఉండేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చిన వారికి మాస్కులు కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, చేతులెత్తి దండం పెట్టారు. తమ వద్ద ఉన్న మాస్క్‌లను వారికి కట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... మాస్కులు లేకుండా కనిపిస్తే వారిపై కేసులు పెడతామని, రూ.1000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఏఆర్‌ డీఎస్పీ రెలా జనార్ధన్‌రెడ్డి, మహబూబాబాద్‌ సబ్‌ డివిజనల్‌ డీఎస్పీ నరేశ్‌, ఆర్‌ఐలు నర్సయ్య, పూర్ణచందర్‌, ట్రాఫిక్‌ ఎస్సై తదితరలు పాల్గొన్నారు. 


logo