శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 18:33:48

అర్వింద్‌ రాజీనామా చేయకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాం

అర్వింద్‌ రాజీనామా చేయకపోతే నీ ఇంటిని ముట్టడిస్తాం

నిజామాబాద్‌ : పార్లమెంటు ఎన్నికల వేళ బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన ప్రకారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తక్షణమే రాజీనామా చేయాలని బాల్కొండ నియోజక వర్గ పసుపు రైతులు డిమాండ్‌ చేశారు. జిల్లాలోని వేల్పూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పసుపు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడారు. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో శనివారం అర్వింద్‌తో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు రైతులు నిర్వహించనున్న సమావేశపై తీవ్ర అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేశారు. 

పసుపు రైతుల ఐక్యతను విచ్ఛినం చేసేందుకే రైతులతో అర్వింద్‌ మీటింగ్‌ పెట్టారని ఆరోపించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తేకపోతే రాజీనామా చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేయకుండా రైతులతో మీటింగ్‌ల పేరిట తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. రీజినల్‌ కార్యాలయం పసుపు బోర్డుకంటే ఉపయోగకరమైనదని చెబుతున్న అర్వింద్‌ అదే మాటతో రాజీనామా చేసి మళ్లీ  ఓట్లడిగి గెలువాలని సవాల్‌ విసిరారు. 

కల్లబొల్లి మాటలు మాని వెంటనే పసుపు బోర్డు, పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర తీసుకురావడమా..లేదా రాజీనామా చేసి రైతులతో కలిసి రావడమా అనేదే తమ డిమాండ్‌ అన్నారు. పత్తిని మద్దతు ధరకు కొంటున్న కేంద్రం పసుపును ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. అర్వింద్‌ తక్షణమే రాజీనామా చేయకపోతే అయన ఇంటిని ముట్టడిస్తామని, నియోజక వర్గంలో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. ‘నీకు చేత కాకపోతే ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లు..ఆయనతో మేమే మా సమస్యను చెప్పుకుంటాం’ అని అర్వింద్‌కు సూచించారు. సమావేశంలో వంద మందికి పైగా పసుపు రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?

కిలిమంజారోను అధిరోహించిన అన్వితా రెడ్డి

ఏసీబీ వలలో ప్రభుత్వ ఉద్యోగి

ఐటీ హబ్‌తో మెరుగైన ఉపాధి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం

ఫైనాన్స్ కంపెనీ వేధింపులు..ఆటోకు నిప్పు పెట్టిన బాధితుడు

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు 

 


VIDEOS

logo