40 వేలమంది రోహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తుంది?

హైదరాబాద్: హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతీ లేదన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముందు తన నియోజకవర్గాన్ని చూసుకుంటే బాగుంటుందని సూచించారు. కరీంనగర్లో ఉండే బండి సంజయ్‌కు హైదరాబాద్‌కు గురించి ఏం తెలుసని విమర్శించారు. హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రయిక్ చేస్తారా, మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని మీరు ఎప్పుడైనాపాలించారా.. సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్నదని చెప్పారు. బీజేపీని చూసి ఎంఐఎం నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో వారి సంఖ్య ఎంత? వారి బలమెంత అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణసాధ్యంకాని హామీలిచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జీహెచ్ఎంసీకి సంబంధం లేని హామీలున్నాయని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్