శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 00:51:09

మూవీ, టీవీ ఆర్టిస్టులకు గుర్తింపుకార్డులు

మూవీ, టీవీ ఆర్టిస్టులకు గుర్తింపుకార్డులు
  • మంత్రి తలసానికి విజ్ఞప్తిచేసిన సంఘం ప్రతినిధులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్టులకు గుర్తింపుకార్డులు మంజూరుచేయాలని మూవీ, టీవీ ఆర్టిస్ట్స్‌ సంఘం ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సంఘంలో 800 మంది సభ్యులున్నారని, అందరికీ హెల్త్‌కార్డులను మంజూరుచేయాలని, ఇండ్లకు స్థలాలు కేటాయించాలని కోరా రు. మంత్రిని కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్‌, ప్రధాన కార్యదర్శి సైదులు, అప్పారావు, ఆశ, లక్ష్మి తదితరులు ఉన్నారు.logo