గురువారం 04 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 15:03:18

మహబూబ్‌నగర్‌ వైద్య కాలేజీకి మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న 17 మంది

మహబూబ్‌నగర్‌ వైద్య కాలేజీకి మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న 17 మంది

మహబూబ్‌నగర్‌ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ భవనంలో ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో సుమారు 1500 నుంచి 1700 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. ఈ ప్రార్థనలకు హాజరైన పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ నుంచి ఈ ప్రార్థనలకు హాజరైన వారిని అధికారులు గుర్తించారు. 17 మందిని గుర్తించిన అధికారులు వీరందరిని వైద్య చికిత్సల నిమిత్తం తక్షణమే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. వీరందరిని క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించనున్నట్లుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.


logo