శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 19:06:43

ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు మృతదేహం గుర్తింపు

ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు మృతదేహం గుర్తింపు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. ఛత్తీస్ గఢ్ రాష్రం సుకుమా జిల్లాలోని అర్లపల్లి గ్రామం పొలంపల్లికి చెందిన దూడి దేవా అలియాస్ దేవాలు అలియాస్ శంకర్ గా నిర్ధారించారు. కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానలోని మృతదేహాన్ని పోలీసులు ఈ రోజు బంధువులకు అప్పగించారు. దేవా మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి హరిభూషన్ కు స్పెషల్ ప్రొటెక్షన్ టీం కమాండర్(ACM)గా యాక్షన్ టీం మెంబర్ గా పని చేస్తున్నాడని ఈ సందర్భంగా పోలీసులు వివరాలను వెల్లడించారు.logo