ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 13:04:47

పీవీ నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి హరీశ్‌ రావు

పీవీ నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో పీవీ చిత్ర పటానికి మంత్రి నివాళులు అర్పించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది పీవీ శత జయంతి  సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో విగ్రహాలు కూడా పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చి గౌరవించాలన్నారు. 


logo