గురువారం 09 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 17:47:40

ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శం : మంత్రి కొప్పుల

ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శం : మంత్రి కొప్పుల

జగిత్యాల : ప్రాజెక్టుల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, చేపడుతున్న అభివృద్ధి పనుల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో రూ.25 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో అక్కపెల్లి చెరువు మత్తడిపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలోని చెరువులకు జలకళ వచ్చిందన్నారు. 

చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో బంగారు పంటలు పండించడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. అక్కపెల్లి చెరువుకు గోదావరినది నుంచి ఎత్తిపోతల పథకం మంజూరైందని, అలాగే చెరువు పునరుద్ధరణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ తదితరులు పాల్గొన్నారు.


logo