శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:48:44

ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు

ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు

  • ఐసీఏఆర్‌ పురస్కారం అందుకున్నరాజీవ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌వర్షీని జాతీయఅవార్డు వరించింది. వ్యవసాయరంగానికి అందిస్తున్న విశేషసేవలకు గుర్తింపుగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) ఆయనకు ‘రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌' అవార్డును బహూకరించింది. గురువారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఐసీఏఆర్‌ 92వ వార్షికోత్సవంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ అవార్డును అందజేశారు. డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ ప్రస్తుతం ఇక్రిశాట్‌లోని ‘జెనెటిక్‌ గెయిన్స్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌'కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్లాంట్‌ జీనోమిక్స్‌, జినోమిక్స్‌ అసిస్టెడ్‌ క్రాప్‌బ్రీడింగ్‌ విభాగాల్లో రాజీవ్‌కుమార్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నది. ఆయన నేతృత్వంలోని ఇక్రిశాట్‌ బృందం కందులు, శనగలు, పల్లీలు, సజ్జ పంటల జన్యుక్రమాలను గుర్తించింది. ఐసీఏఆర్‌ 1956 నుంచి ఏటా ‘రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌'అవార్డుతోపాటు రూ.5 లక్షల నగదు బహుమతిని అందజేస్తున్నది.logo