మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:23:30

కరోనా సామాజిక వ్యాప్తిపై సర్వే

కరోనా సామాజిక వ్యాప్తిపై సర్వే

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో సాధారణ ప్రజలలో కరోనా సామాజిక వ్యాప్తి? వివిధ వయస్సులవారిపై దాని ప్రభావం? ప్రతిరక్షకాలు ఎలా వృద్ధిచెందుతున్నాయనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సంయుక్తంగా సెరో- ఎపిడెమియోలాజికల్‌ (sero-epidemiological) సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ సర్వే రెండోదశ బుధవారం ప్రారంభమైంది. జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. 1,200 వరకు రక్త నమూనాలను సేకరించి, సీరమ్‌ను వేరుచేసి కరోనా యాంటీబాడీలను గుర్తిస్తారు. ప్రతిరక్షకాలు ఎలా వృద్ధిచెందాయనే విషయాన్ని నిర్ధారిస్తారు. మేలో జరిపిన తొలిదశ సర్వేలో 3 శాతమే సామాజిక వ్యాప్తి ఉన్నట్టు తేలిందని ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త జీఎం సుబ్బారావు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఈ సర్వేతో అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుసుకోవచ్చన్నారు.


logo