మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 09:11:28

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్‌ నాయకులు మస్కు నర్సింహ్మ(52) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహ్మా..  ఐదు రోజుల క్రితం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1994లో జరిగిన ఎంపీటీసీ గా చింతుల్ల ఎన్నికల్లో సీపీఎం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందాడు.2000 సంవత్సరం లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలో యాచారం మండలం నుంచి పోటీ చేసి స్వల్ప తేడా తో ఓటమి పాలయ్యాడు.  2009 లో ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ అంతర్గత విషయం లో సీపీఐ పార్టీలో చేరాడు. మళ్ళీ 2015లో సీపీఎం లో చేరాడు. ప్రస్తుతం వ్యవసాయ కార్మిక సంఘ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా కొనసాగుతున్నాడు. నియోజకవర్గ ప్రజల్లో ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  


logo