మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 03:10:51

సీఎంవో కార్యదర్శిగా ఐఏఎస్‌ శేషాద్రి

సీఎంవో కార్యదర్శిగా ఐఏఎస్‌ శేషాద్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేషాద్రిని ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా నియమించారు. 1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి.. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ అయి రాష్ర్టానికి వచ్చారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనను సీఎంవోలో కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనకు భూ పరిపాలన, వ్యవసాయ సంబంధ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. శేషాద్రి తెలంగాణకు సంబంధించి 2005-08 మధ్య రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, 2010-13 మధ్య మూడేండ్లపాటు రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. 2013 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు సుమారు ఏడేండ్లపాటు ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేశారు. డిప్యుటేషన్‌ పూర్తవడంతో ఇటీవలే తిరిగి తెలంగాణకు వచ్చి రిపోర్ట్‌చేశారు. తాజాగా ఆయనకు కీలక పోస్టింగ్‌ ఇచ్చారు.


logo