హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. వెయిటింగ్లో ఉన్న అనితా రామచంద్రన్‌ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనితా రామచంద్రన్ సేవలందించిన విషయం తెలిసిందే.