మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 01:40:42

నేను పుట్టిందే ప్రజాసేవ కోసం

నేను పుట్టిందే ప్రజాసేవ కోసం

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

ఖిల్లాఘణపురం/పెద్దమందడి/వనపర్తి రూరల్‌: ‘నేను పుట్టిందే ప్రజాసేవ కోసం.. నిరంతరం రైతుల సంక్షేమ కోసం పని చేసేందుకు కృషి చేస్తున్నా’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాతో కలిసి మంత్రి పర్యటించారు. కర్నెతండాలో లిఫ్ట్‌ సర్వే పనులను ప్రారంభించారు. పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయిపల్లి జంట గ్రామాల్లోని బసిరెడ్డి చెరువును పరిశీలించారు. వనపర్తి మండలం దత్తాయిపల్లి  ఆటవీప్రాంతంలో పోలీసు శాఖ, అటవీ శాఖ, గ్రామీణ, ఉపాధి శాఖలు సంయుక్తంగా నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కర్నెతండా లిఫ్ట్‌ పనులు వేగవంతంగా పూర్తి చేసి దసరా నాటిని నీళ్లు దుమికేలా చేస్తామన్నారు.


logo