గిసొంటి నాయకుడిని సూడలే

- కంది సూర్యనారాయణ నాయీబ్రాహ్మణ
- సేవా సంఘం వ్యవస్థాపక సభ్యుడు
మేడ్చల్, నమస్తే తెలంగాణ: నా 89 ఏండ్ల జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడిని సూడలేదని నాయీబ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక సభ్యుడు, నల్లగొండ జిల్లాకు చెందిన కంది సూర్యనారాయణ అన్నారు. సెలూన్ షాపులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని సీఎం ప్రకటించడంపై స్పందించిన ఆయన.. నాయీబ్రాహ్మణులంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ‘వందల ఏండ్లుగా ప్రతి బిడ్డకు పురుడు పోసినం. ఇప్పుడు దవాఖానలు వచ్చినయి. కానీ పూర్వంల దవాఖానలు ఎక్కడివి, డాక్టర్లెక్కడిది. మేము కాన్పులు చేసేటోళ్లం. ప్రతి శుభకార్యానికి మేమే వాయిద్యం వాయించేటోళ్లం. కానీ మమ్మల్ని ఇన్నాళ్లూ ఏ ఒక్క నాయకుడు గుర్తించలే. పట్నంల సెలూన్ షాపులు పెట్టాలంటే మూడు నాలుగు లక్షలు ఖర్చవుతాయి. దీంట్ల కరెంట్ కోసం రూ.20-30 వేలవరకు అవుతుంది. షాపు సరిగా నడువకుంటే.. అద్దె, నెలనెలా కరెంట్ బిల్లు భారమయ్యేది. అప్పులపాలయ్యేటోళ్లు. ఇకనుంచి నాయీబ్రాహ్మణుల షాపులకు కరెంట్ కష్టాలుండవు. కేసీఆర్ సార్ హామీతో మాకు భరోసా దొరికింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాయీబ్రాహ్మణులమంతా కారు గుర్తుకే ఓటేస్తాం. సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్న’. అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
- మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..