గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 15:05:54

మా నాన్న ఆస్తులపై ఆశ లేదు : అమృత

మా నాన్న ఆస్తులపై ఆశ లేదు : అమృత

నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటిక వద్దకు అమృత వెళ్లగా, ఆమెను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. దీంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుదిరిగింది. 

అనంతరం మిర్యాలగూడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. శిక్ష భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది కరెక్ట్‌ కాదేమో. ప్రణయ్‌ని హత్య చేయించిన విషయంలో ఆయనలో పశ్చాత్తాపం కనపడలేదు. మా నాన్నకు బినామీ పేర్లతో ఆస్తులు చాలా ఉన్నాయి. ఆస్తుల విషయంలో మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్‌ కొన్నిసార్లు కొట్టినట్లుగా నాకు తెలిసింది.

మారుతీరావు ఆస్తులపై నాకు ఆశ, ఆసక్తి లేదు. మా అమ్మకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. శ్రవణ్‌ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించాడు. నాకిప్పుడు భర్త లేడు, తండ్రి లేడు. భర్త లేకున్నా నాకు అత్తమామలు ఉన్నారు. మా అమ్మకు ఎవరూ లేరు. ఆమె నా దగ్గరికి వస్తానంటే కాదనను. బాబును చూపించమని మా అమ్మ ఓసారి నా దగ్గరకు వచ్చింది. చూపించనని అమ్మతో చెప్పాను. నా భర్తను చంపిన వారికి చట్టపరంగా శిక్ష పడాలని కోరుకున్నాను’ అని అమృత తెలిపారు.

అమృతను అడ్డుకున్న బంధువులు..


logo
>>>>>>