శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 14:00:13

నేను బాగున్నా... నాకెలాంటి అనారోగ్య సమస్యలూ లేవు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నేను బాగున్నా... నాకెలాంటి అనారోగ్య సమస్యలూ లేవు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ : ప్రజల ఆశీస్సులతో తాను బాగున్నాన‌ని, త‌న‌కెలాంటి అనారోగ్య సమస్యలూ లేవ‌ని, దయచేసి ఎవరూ అబద్ధపు ప్రచారాలు చేయొద్ద‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాంటి ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్ద‌న్నారు. ఇబ్బందులు వస్తే కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు, ప్రజలతోనే పంచుకుంటాన‌న్నారు. తనకు కరోనా వచ్చిందంటూ కొందరు వ్యక్తులు, ప‌లు మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులని మంత్రి ఎర్రబెల్లి ఖండించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క‌రోనా వ్యాప్తి జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్రజల కోసం, ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానివ్వడానికి విస్తృతంగా ప్రజల్లోనే తిరుగుతున్నామన్నారు.

తనతో పాటు తన సిబ్బంది కూడా అహర్నిషలు పని చేస్తున్నారని చెప్పారు. కుటుంబంతో సహా, సిబ్బంది కుటుంబాల క్షేమం కోసం హైదరాబాద్, పర్వతగిరిలలో అన్ని రకాల సిబ్బందికి పరీక్షలు చేయించామన్నారు. వీరిలో ఎస్కార్ట్, పైలట్ వాహనాలలో పని చేసే ఆరుగురు గన్ మెన్లు, మరో ఇద్దరు హైదరాబాద్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌న్నారు. వాళ్ళంతా తగు చికిత్సలు చేయించుకుంటూ క్షేమంగా ఉన్నారని మంత్రి వివరించారు. త‌న‌తో పాటు, మిగతా సిబ్బంది అంతా క్షేమంగా, ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపారు. 


logo