శనివారం 29 ఫిబ్రవరి 2020
భాగస్వామితో ప్రేమ వేడుక

భాగస్వామితో ప్రేమ వేడుక

Feb 14, 2020 , 03:17:43
PRINT
భాగస్వామితో ప్రేమ వేడుక
  • లైఫ్‌పార్ట్‌నర్‌తో వాలెంటైన్స్‌డేకు 86 శాతంమంది ఆసక్తి
  • వైవాహిక బంధం బలపడుతుందంటున్న 58 శాతంమంది
  • భారత్‌ మ్యాట్రిమోని వాలెంటైన్స్‌డే సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీవిత భాగస్వామితో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు ఎక్కువమంది ఆసక్తిచూపుతున్నారు. 86 శాతంమంది లైఫ్‌ పార్ట్‌నర్‌తో వాలెంటైన్స్‌ డే వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది. శుక్రవారం వాలెంటైన్స్‌డేను పురస్కరించుకొని మ్యాట్రిమోని.కామ్‌ సంస్థ భారత్‌ మ్యాట్రిమోని వాలంటైన్స్‌ డే సర్వే-2020ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 8,058 మంది యువత పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వాలెంటైన్స్‌డే జరుపుకోవడం ద్వారా వైవాహిక బంధం బలపడుతుందని 58 శాతం మహిళలు, 45 శా తం పురుషులు విశ్వసిస్తున్నారు. 


17 శాతంమంది మహిళలు, 23 శాతంమంది పురుషులు తమ ప్రేమను తెలిపేందుకు వాలెంటైన్స్‌ డేను ఎంచుకుంటున్నారు. జీవిత భాగస్వామికి తమ ప్రేమను ఎలా వ్యక్తపర్చాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘నేను.. నాకు తగిన వ్యక్తిని పొందాను’ అని 54 శాతం మహిళలు, ‘నేను నాకు తగిన భాగస్వామిని పొందాను’ అని 25 శాతం పురుషులు సమాధానం ఇచ్చారు. 22 శాతంమంది మహిళలు, 32 శాతంమంది పురుషులు బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తపర్చాలని భావిస్తున్నట్టు సర్వేలో తేలింది. వివా హం తర్వాత ప్రేమికుల రోజు కంటే పెండ్లిరోజు, పుట్టినరోజు వేడుకలు ఎంతో ముఖ్యమైనవని 31 శాతం మహిళలు, 41 శాతం మంది పురుషులు అభిప్రాయపడుతున్నారు.


వాలెంటైన్స్‌ డే మార్కెటింగ్‌ జిమ్మిక్‌

వాలెంటైన్స్‌ డేను 35 శాతంమంది మహిళలు, 29 శాతం మంది పురుషులు.. ఒక మార్కెటింగ్‌ జిమ్మిక్‌గా పేర్కొంటున్నట్టు సర్వేలో తేలింది. దేశంలోని యువతలో 91 శాతంమంది జీవితకాలం ప్రేమను అందించే భాగస్వామిని పొందేందుకు మ్యాట్రిమోనిలను సంప్రదిస్తున్నట్టు వెల్లడయింది. పెండ్లి తర్వాత ప్రేమను వ్యక్తంచేసేందుకు వివాహ వార్షికోత్సవమే సరైన రోజు అని 47 శాతం మహిళలు, 42 శాతం పురుషులు అభిప్రాయపడుతున్నారు. జీవిత భాగస్వామి పుట్టినరోజున ప్రేమ వ్యక్తంచేసేందుకు 34 శాతం మహిళలు, 31 శాతం పురుషులు ఆసక్తి చూపుతున్నట్టు సర్వేలో వెల్లడయింది. 
logo