ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 12:43:06

త్వ‌ర‌గా కోలుకోవాలి బావ‌.. కేటీఆర్ ట్వీట్

త్వ‌ర‌గా కోలుకోవాలి బావ‌.. కేటీఆర్ ట్వీట్

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు క‌రోనా బారిన ప‌డిన విష‌యం విదిత‌మే. ఈ మేర‌కు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు హ‌రీష్‌రావు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. 

హ‌రీష్‌రావుకు క‌రోనా సోక‌డంపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గెట్ వెల్ సూన్ బావ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇత‌రుల కంటే మీరు త్వ‌ర‌గా కోలుకుంటార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని కేటీఆర్ అన్నారు. మొత్తానికి కొవిడ్ నుంచి హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. 

హ‌రీష్‌రావు అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. హ‌రీష్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. 


logo