మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 17:04:20

పరిశుభ్రతను సామాజిక ఉద్యమంలా చేపట్టాలి

పరిశుభ్రతను సామాజిక ఉద్యమంలా చేపట్టాలి

వరంగల్ రూరల్ : ఐటీ, పరిశ్రమలు, పుర‌ పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొన్నారు. పర్వతగిరిలోని త‌మ‌ నివాసంలో త‌న స‌తీమ‌ణి  ఉషతో క‌లిసి పారిశుద్ధ్య ప‌నులు చేశారు.

మొక్కలకు నీళ్లు పట్టారు. ఇంట్లో నీటి నిలువ‌లు లేకుండా చేశారు. చెత్తా చెదారం తీసేసి, దోమ‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుని ప్రజలంతా పాటించాలన్నారు. ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని సూచించారు.

ఈ సీజన్ లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని, ఇది కేవ‌లం పారిశుద్ధ్యం వ‌ల్లే సాధ్యమని చెప్పారు. ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా, ఆరోగ్యంగా ఉంచ‌వ‌చ్చని చెప్పారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.


logo