సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 19:25:25

నీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక

నీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక

హైదరాబాద్ :  ఖైరతాబాద్‌ జలమండలి కార్యాలయంలో ఎండీ దాన కిషోర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ వసూళ్లలో ఉదాసీనంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బకాయి ఉన్న వాణిజ్య కనెక్షన్లు గుర్తించి వసూళ్లలో వేగం పెంచాలి. జూన్‌లోగా వాణిజ్య బకాయిల బిల్లుల వసూలు పూర్తి చేయాలి. కలుషిత నీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించాలి. నీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలి. వేసవి కార్యాచరణ అమలుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 


logo