బీజేపీకి నగర ఓటర్లు బుద్ధి చెప్పాలి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : మతం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలను పెంచే బీజేపీకి నగర ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆమె ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గీతా ప్రవీణ్ ముదిరాజ్ తరఫున పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఎన్నికల వేళ బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆక్షేపించారు. కొన్ని ఓట్లు.. సీట్లకోసం విభజన రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. లౌకకవాద పార్టీ టీఆర్ఎస్తోనే హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. అన్నివర్గాలను సమాన దృష్టితో చూసే సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి 9 వేల ఓటర్ల మెజారిటీతో గెలిచింది. ఈ సారి అంతకుమించి మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు. రేపటి సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు