సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 19:18:13

ముట్టుకోకుండానే చేతులు శానిటైజ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే

ముట్టుకోకుండానే చేతులు శానిటైజ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా శారీరక పరిశుభ్రత ప్రతి ఒక్కరికీ అలవడింది. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు.. బయటి నుంచి ఇంటికి రాగానే చేతులు, కాళ్లు పరిశుభ్రంగా సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం దినచర్యలో భాగంగా మారింది. అయితే పెద్ద కంపెనీల్లో, సంస్థల్లో శానిటైజర్ బాటిల్ ను మెయింటేన్ చేయడం ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. ఒకరి తర్వాత ఒకరు ముట్టుకోవడం వలన వైరస్ వ్యాప్తి జరుగుతుందనే నిపుణుల సూచనలతో సెల్ఫ్ శానిటైజర్లను వినియోగిస్తన్నారు. 

శానిటైజేషన్ చేసుకొవడానికి అంటుకోకుండా, ముట్టుకోకుండా ఉండేలా విధానాన్ని హైదరాబాద్ కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ సిద్ధం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఫాక్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే సంస్థ.. చేతులతో ముట్టుకోనక్కర్లేని శానిటైజర్ శోధన్ ఎల్- సెన్సార్ బేస్డ్ ఆటోమేటిక్, టచ్ ఫ్రీ హ్యాండ్ శానిటైజర్ ను తయారుచేసింది.  ఈ శానిటైజర్ పూర్తిగా డబ్ల్యుూహెచ్ వో , సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాల మేరకు తయారుచేశారు.  ఈ శానిటైజర్ కింద చేతులు పెట్టగానే ఆటోమేటిక్ గా ప్రతిసారి2.5 ఎంఎల్ శానిటైజర్ పడేవిధంగా తీర్చిదిద్దారు.  ఈ  శానిటైజర్ ను వినియోగించేందుకు తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని, ముప్పు లేనటువంటి శానిటైజర్ ను పొందవచ్చునని ఎంఫాక్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు ఎస్పీ చందు తెలిపారు. ఎక్కడైనా అమర్చుకోవచ్చునని, మెయింటెనన్స్ కూడాతక్కువగా ఉంటుందని, లీకేజీలు, వేస్టేజీ అసలే ఉండదని పేర్కొన్నారు. వీటిని కంపెనీలు, దవాఖానలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మాల్స్ వంటి పెద్దపెద్ద సంస్థల్లో అమర్చుకోవచ్చునని ఆయన సూచిస్తున్నారు.  మార్కెట్లోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే వేయి వరకు విక్రయించామని, ఇంకా ఆర్డర్లు ఉన్నాయని చందు వెల్లడించారు.


logo