మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 26, 2020 , 16:26:40

41 అనాథ, వృద్ధాశ్రమాల దత్తత తీసుకున్న రాచకోండ పోలీసులు

41 అనాథ, వృద్ధాశ్రమాల దత్తత తీసుకున్న రాచకోండ పోలీసులు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో సమస్యలను ఎదుర్కొంటున్న 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి ఆశ్రమాలను రాచకోండ పోలీసు కమిషనరేట్‌ దత్తత తీసుకుంది. వివిధ ఎన్‌జీవోల సహాయంతో వాటికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కిరాణా సామాన్లు, మందులను పోలీసులు అందిస్తున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ప్రజలు వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇలాంటివారికి సహాయం చేయాలనుకునేవారు, ఆయా ఆశ్రమాల నిర్వహణను చూసేవారు బయటకు వచ్చే అవకాశం లేదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అన్నారు. ఈ ఆశ్రమాలకు ఎప్పుడు ఏంకావాలనే అంశాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ తెలుసుకుని, వాటికి సంబంధించిన వివరాలను కమిషనరేట్‌కు అందిస్తారని చెప్పారు. రాచకొండ ఈ ఆశ్రమాలకు రేషన్‌, ఆహారం, ఇతర పదార్థాల సేకరణ, పంపిణీని పోలీస్‌ కమిషనరేట్‌లోని సిటిజన్‌ వాలంటీర్‌ సెల్‌ నిర్వహిస్తున్నదని ఆయన వెల్లడించారు. మొత్తం 41 అనాథ, వృద్ధాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తుల ఆశ్రమల్లో సుమారు 1630 మంది ఉంటునట్లు గుర్తించామని తెలిపారు.  


logo