మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 20:36:11

క‌రోనా ఉద్ధృతి.. బేగం బ‌జార్ మ‌రోసారి మూసివేత

క‌రోనా ఉద్ధృతి.. బేగం బ‌జార్ మ‌రోసారి మూసివేత

హైద‌రాబాద్ : న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ ఉద్ధృతి ఎక్కువ అవుతోంది. ర‌ద్దీగా ఉండే బేగం బ‌జార్ లో క‌రోనా పాజిటివ్ కేసులు అధికమ‌వుతుండ‌టంతో.. మ‌రోసారి మూసివేయాల‌ని వ్యాపారులు నిర్ణ‌యించారు. జూన్ 28 నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు షాపుల‌న్నింటినీ మూసివేస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలో కిర‌ణా వ్యాపారంలో బేగం బ‌జార్ నంబ‌ర్ వ‌న్ గా ఉంటుంది. జిల్లాల నుంచి కూడా వ్యాపారస్తులు బేగం బ‌జార్ వ‌చ్చి స‌రుకులు తీసుకుని వెళ్తుంటారు.  

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ కిర‌ణా మార్చెంట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ల‌క్ష్మినారాయ‌ణ రాథి మాట్లాడుతూ.. బేగం బ‌జార్ లో సుమారు 500ల‌కు పైగా కిర‌ణా దుకాణాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ దుకాణ య‌జ‌మానుల అంగీకారంతోనే వారం రోజుల పాటు బేగం బ‌జార్ మూసివేత‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.  

క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా త‌మ వ్యాపారానికి తీవ్ర భంగం వాటిల్లింద‌ని పేర్కొన్నారు. కొవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న వారంద‌రూ స్వ‌త‌హాగా హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు. 


logo