శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 06, 2020 , 21:26:18

మ‌ళ్లీ తెరుచుకున్న బేగం బజార్‌.. వ్యాపారుల‌తో కిట‌కిట‌

మ‌ళ్లీ తెరుచుకున్న బేగం బజార్‌.. వ్యాపారుల‌తో కిట‌కిట‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని బేగం బ‌జార్ మ‌ళ్లీ తెరుచుకుంది. క‌రోనా కేసుల తీవ్ర‌త నేపథ్యంలో ప‌ది రోజుల పాటు బేగం బ‌జార్ ను మూసేశారు. జూన్ 28 నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు మూసిన షాపుల‌న్నీ సోమ‌వారం తిరిగి తెరుచుకున్నాయి. ఈ బ‌జార్ లో సుమారు 1500ల‌కు పైగా దుకాణాలు ఉన్నాయి. 

షాపులు తెరుచుకోవ‌డంతో.. వ్యాపారులు, ప్ర‌జ‌ల ర‌ద్దీ బాగా క‌నిపించింది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపారు. క‌రోనా నేప‌థ్యంలో ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే దుకాణాల‌కు అనుమ‌తిస్తున్నారు. క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌న్నింటినీ తీసుకుంటున్న‌ట్లు బేగం బ‌జార్ మార్చెంట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ల‌క్ష్మినారాయ‌ణ రాథి చెప్పారు. వ్యాపారుల‌కు మాస్కులు ఇస్తున్నామ‌ని తెలిపారు. శానిటైజ‌ర్ విధిగా వాడాల‌ని వ్యాపారుల‌కు సూచించామ‌ని పేర్కొన్నారు. షాపుల వ‌ద్ద భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. 


logo