e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం

హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం

హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. న‌గ‌రంలో ఈ ఏడాది జులై 20 నాటికి సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. నిన్న‌టి వ‌ర‌కు న‌గ‌రంలో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్ల తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్ల‌డించింది. జులై 20వ తేదీ వ‌ర‌కు 359.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. ఈ తేదీ వ‌ర‌కు సాధార‌ణ వ‌ర్ష‌పాతం 210.9 మి.మీ. మాత్ర‌మే. ఐఎండీ డాటా ప్ర‌కారం.. జులైలో నెల‌లో 285.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, గ‌త ప‌దేళ్ల‌లో ఇదే అత్య‌ధిక‌మ‌ని వెల్ల‌డించింది. ఇక రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

ఆదిలాబాద్, వ‌రంగ‌ల్ అర్బ‌న్, వ‌రంగ‌ల్ రూర‌ల్, సిద్దిపేట‌, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఇక హైద‌రాబాద్‌లో కూడా రాబోయే మూడు రోజుల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి చిరుజ‌ల్లులు

- Advertisement -

హైద‌రాబాద్‌లో బుధ‌వారం తెల్ల‌వారుజాము నుంచి చిరుజ‌ల్లులు కురుస్తున్నాయి. ఉప్ప‌ల్, అల్వాల్, రాజేంద్ర‌న‌గ‌ర్, కార్వాన్ ఏరియాల్లో 0.5 మి.మీ. నుంచి 2 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది. బాచుప‌ల్లిలో ఉద‌యం 10 గంట‌ల‌కు భారీ వ‌ర్షం కురిసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం
హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం
హైద‌రాబాద్‌లో 70 శాతం అధికంగా వ‌ర్ష‌పాతం

ట్రెండింగ్‌

Advertisement