మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 01:37:22

నివాసయోగ్య, ఉపాధి కార్యక్రమాల్లో హైదరాబాదే బెస్ట్‌

నివాసయోగ్య, ఉపాధి కార్యక్రమాల్లో హైదరాబాదే బెస్ట్‌

  • నివాసయోగ్య, ఉపాధి కార్యక్రమాల్లోదేశంలోనే ఉత్తమ నగరంగా గుర్తింపు
  • 34 నగరాల్లో మొదటిస్థానం కైవసంవెల్లడించిన హాలిడిఫై వెబ్‌సైట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మరోసారి ఉత్తమ నగరంగా నిలిచింది. దేశంలోని నివాసయోగ్య, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ అంశాల్లో మొదటిస్థానం దక్కించుకున్నది. ఉత్తమ అవకాశాలు, మెరుగైన మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి, ఆభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా హాలిడిఫై డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ తాజాగా 34 నగరాల్లో సర్వే నిర్వహించింది. సాంస్కృతిక సమ్మేళం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలను ఈ సర్వే కోసం ఎంపికచేసింది. అందులో ఉత్తమ నగరాల జాబితాను రూపొందించింది. ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీలను అధిగమిం చి హైదరాబాద్‌ ఉత్తమ నగరంగా నిలిచింది. హైదరాబాద్‌ నగరం భిన్న సంస్కృతులు, కొత్తపాతల సమ్మేళనమని సర్వే అభిప్రాయపడింది. హైదరాబాద్‌ను దక్షిణ భారతదేశ న్యూయార్క్‌ అని అభివర్ణించింది. ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడం, అత్యాధుక విమానాశ్రయం, ప్రపంచస్థాయి స్కూళ్లు కలిగి ఉండటం హైదరాబాద్‌ను ఉత్తమ నగరాల్లో నిలుపడానికి కారణాలని తెలిపింది. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య తక్కువేనని పేర్కొన్నది. చారిత్రక, వారసత్వ సంపదతో హైదరాబాద్‌ గొప్ప పర్యాటక కేంద్రంగా నిలిచిందని తెలిపింది. చార్మినార్‌, బిర్యానీ హైదరాబాద్‌ ప్రత్యేకతలని పేర్కొన్నది. హైదరాబాద్‌లో 80కిపైగా పర్యాటక కేంద్రాలు ఉన్నట్టు హాలిడిఫై వెల్లడించింది.


logo