శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 12:08:32

మక్కా మసీదులో ఈద్‌ నమాజ్‌ కోసం ప్రజలకు అనుమతి లేదు

మక్కా మసీదులో ఈద్‌ నమాజ్‌ కోసం ప్రజలకు అనుమతి లేదు

హైదరాబాద్‌ : కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం హైదరాబాద్‌లోని మక్కా మసీదులో బక్రీద్‌ ఈద్ నమాజ్ కోసం ఎక్కువ సంఖ్యలో ముస్లింలకు అనుమతి లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కూడా మక్కా మసీదును మూసే ఉంచారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మత పెద్దలు తెలియజేశారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలకు మసీదుకు వేలల్లో ముస్లింలు వస్తారు. ఇంత పెద్ద మొత్తంలో జనం ఒక దగ్గర ఉంటే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మసీదులో కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే నమాజ్ చేస్తున్నారని మౌలానా హఫీజ్ మొహద్ రిజ్వాన్ ఖురేషి తెలిపారు. .

ఇదిలా ఉండగా చార్‌మినార్‌ సమీపంలో ఉన్న మక్కా మసీదులో సుమారు 10 వేలకు పైగా జనం ప్రార్థనలు చేయవచ్చు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందు 3000-5000 మంది ముస్లింలు శుక్రవారం ప్రత్యేక సందర్భాల్లో నమాజ్ చేసేవారు. 

అయితే రాష్ట్రంలోని ఈద్గాహ్‌ల వద్ద ఈద్‌ నమాజ్‌ను అనుమతించడంపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ తెలియజేశారు. మత పెద్దలు, బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించిన తరువాత ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo