గురువారం 09 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 15:37:31

మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత: హోం మంత్రి

మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత: హోం మంత్రి

హైదరాబాద్‌: మహిళల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని హోం మంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. మహిళ రక్షణ కోసం సీఎం కేసీఆర్‌ షీటీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న గృహ హింస, దాడులపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘స్త్రీ’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నగరంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయని, హైదరాబాద్‌ పోలీసులు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ శాఖకు ప్రత్యేక సహకారం అందిస్తున్నదని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ చెప్పారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, భరోసా సెంటర్లతో రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. మహిళలు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులన్నా డయల్‌ 100కు సమాచారం అందించాలని చెప్పారు. 


logo