మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 17:43:32

క‌రోనాతో హోంగార్డు మృతి

క‌రోనాతో హోంగార్డు మృతి

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్ సిటీ పోలీసు విభాగంలో ప‌ని చేస్తున్న ఓ హోంగార్డు క‌రోనాతో చ‌నిపోయాడు. మృతుడిని మ‌హ్మ‌ద్ అస‌దుద్దీన్‌(56)గా పోలీసులు గుర్తించారు. సౌత్ జోన్ అడిష‌నల్ డీసీపీ ఆఫీసులో హోంగార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. జూన్ 28న ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

నాటి నుంచి హోంగార్డు హోం క్వారంటైన్ లో ఉన్నారు. సోమ‌వారం ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో.. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాంధీలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుది శ్వాస విడిచాడు హోంగార్డు. అసదుద్దీన్ మృతి ప‌ట్ల ప‌లువురు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. హోంగార్డు కుటుంబానికి అన్ని విధాలా పోలీసు డిపార్ట్ మెంట్ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు.


logo