శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 11:16:58

బాలుడి కిడ్నాప్‌ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

బాలుడి కిడ్నాప్‌ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు

హైదరాబాద్‌ : బాలుడి కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ పోలీసులు 24 గంటల్లో చేధించారు. నిన్న తెల్లవారుజామున చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఆమె కొడుకు రోడ్డు ప్రక్కగా నిద్రిస్తున్నారు. కాగా దుండగుడు బాలుడిని కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాతబస్తీలోని తలాబ్‌కట్ట వద్ద వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాలుడిని రక్షించారు.


logo