సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:51:23

ఆర్టీసీ, రెడ్‌బస్‌తో ‘మెట్రో’ భేటీ

ఆర్టీసీ, రెడ్‌బస్‌తో ‘మెట్రో’ భేటీ

హైదరాబాద్ : లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీపై హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ అధికారులతోపాటు రెడ్‌బస్‌ ప్రతినిధులతో ఈ రోజు సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి మెట్రోరైలు ఆపరేషన్స్‌ ప్రారంభమైతే లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని కోరనున్నారు. ఈమేరకు  చర్చలు జరిపేందుకు సమాయత్తమయ్యారు. ఆపరేషన్స్‌ ప్రారంభమైతే మెట్రోస్టేషన్లలో దిగిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు రోడ్డుమా ర్గం కల్పించాలని కోరనున్నారు.


logo