గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 12:35:52

శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌

శ్రీవారిని దర్శించుకున్న మేయర్‌

హైదరాబాద్‌: నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టు వస్ర్తాలను ప్రదానం చేశారు. 

ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి ఆశిస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు మేయర్‌ చెప్పారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.


logo