శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:12:11

ఇటలీలో చిక్కుకొన్న హైదరాబాదీ

ఇటలీలో చిక్కుకొన్న హైదరాబాదీ

  • కరోనా వ్యాప్తితో నెలరోజులుగా ఇంటికే పరిమితం
  • పలువురు భారత విద్యార్థులదీ ఇదే పరిస్థితి
  • కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అభిలాష్‌ విజ్ఞప్తి

హైద్రాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన డామినిక్‌ అభిలాష్‌ గిల్‌ అనే 27 ఏండ్ల యువకుడు ఇటలీలో చిక్కుకుపోయారు. ఇటలీలోని కటానియా యూనివర్సిటీలో గ్లోబల్‌ పాలిటిక్స్‌ అండ్‌ యూరో మెడిటెరేనియన్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్‌ విద్యనభ్యసిస్తున్న అభిలాష్‌.. ఆ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో నెలరోజుల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. అక్కడున్న అనేకమంది భారత విద్యార్థుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉన్నదని, దీనిపై భారత ఎంబసీ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా పురోగతి లేదని అభిలాష్‌ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ప్రస్తుతం ఇటలీలో అన్ని నగరాలు లాక్‌డౌన్‌ అయ్యాయని, జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.   కటానియా నగరంలో ఎక్కువగా సిసిలీ ప్రజలకు చికిత్స అందిస్తున్నారని, భారత విద్యార్థులు వేర్వేరు నగరాల్లో చిక్కుకుపోయారని, వీరిని రక్షించేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని, స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అభిలాష్‌ విజ్ఞప్తిచేశారు.


logo