మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 18:24:59

దేశంలోనే డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్‌

దేశంలోనే డిఫెన్స్‌ హబ్‌గా హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : దేశంలోనే హైదరాబాద్‌ ఒక డిఫెన్స్‌ హబ్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అనుబంధ సంస్థ నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ భూమిపూజ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టాటా గ్రూప్‌కు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్‌లో నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఇక్కడి నుంచి డీఆర్‌డీఎల్‌తో పాటు అనేక డిఫెన్స్‌ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. రక్షణ రంగానికి హైదరాబాద్‌ గమ్యంగా మారిందన్నారు. నోవా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో రక్షణ వ్యవస్థల రూపకల్పన, తయారీ, అభివృద్ధికి పాటుపడుతుంది.
logo
>>>>>>