సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:32:41

నగరాలకు హైదరాబాద్‌ ఆదర్శం

నగరాలకు హైదరాబాద్‌ ఆదర్శం

  • ‘నమస్తే తెలంగాణ’తో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అనేక అభివృద్ధి పథకాలను చేపట్టినట్టు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మేయర్‌గా నాలుగున్నరేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో సరికొత్త చరిత్ర సృష్టించి ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచినట్టు వెల్లడించారు. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)ను చేపట్టినట్టు, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో, మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ట్రాఫిక్‌ లేకపోవడంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్టీల్‌ బ్రిడ్జిలు, రోడ్ల పునరుద్ధరణ పనులను పరుగులు పెట్టించామని తెలిపారు. దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్‌బ్రిడ్జి, జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబరు 45 ఫ్లైఓవర్‌, పంజాగుట్ట గ్రేవ్‌యార్డ్‌ వద్ద స్టీల్‌ బ్రిడ్జి తదితర ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. 


logo