మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:31:02

దేశంలోనే బెస్ట్‌.. హైదరాబాద్‌

దేశంలోనే బెస్ట్‌.. హైదరాబాద్‌

  • కారు గుర్తుకు ఓటువేయండి: ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు ఎంతో మార్పు ఉందని ఆమె బుధవారం విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. డిసెంబర్‌ 1న జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ మహానగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతిభద్రతలు ఇవన్నీ సీఎం కేసీఆర్‌ నాయకత్వం.. టీఆర్‌ఎస్‌ పార్టీ కారణంగానే జరిగాయని తెలిపారు. ఈ నాయకత్వాన్ని కొనసాగించే బాధ్యత హైదరాబాద్‌ ప్రజలపై ఉందన్నారు. హైదరాబాద్‌ నగరం వరుసగా ఐదేండ్లుగా ఇండియాలో బెస్ట్‌ సిటీగా ఉందని మెర్సర్‌ వంటి ఇంటర్నేషనల్‌ ఏజెన్సీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఇదే అభివృద్ధిని కొనసాగించేందుకు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత కోరారు.