శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 13:21:52

ప్ర‌పంచంలోనే హైద‌రాబాద్ అద్భుత న‌గ‌రం : ఎమ్మెల్యే ఓవైసీ

ప్ర‌పంచంలోనే హైద‌రాబాద్ అద్భుత న‌గ‌రం : ఎమ్మెల్యే ఓవైసీ

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచంలోనే హైద‌రాబాద్ అద్భుత న‌గ‌రం అని చాంద్రాయ‌ణ‌గుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్ప‌ష్టం చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. ఐటీ రంగంలో హైద‌రాబాద్ దూసుకుపోతోంద‌న్నారు. హైద‌రాబాద్ భార‌త‌దేశానికి న్యూయార్క్ లాంటింద‌ని చెప్పారు. మొజంజాహీ మార్కెట్‌ను ప్ర‌భుత్వం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దింద‌ని తెలిపారు. పాత‌బ‌స్తీకి మెట్రో రైలు ఎప్పుడు వ‌స్తుందో చెప్పాల‌ని కోరారు. పాత‌బ‌స్తీలో ర‌హ‌దారుల వెడల్పు ప‌నులు చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆక్ర‌మ‌ణ‌లు కూడా తొల‌గించాల‌ని సూచించారు. పాత‌బ‌స్తీలో నెల‌కొన్న పారిశుద్ధ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌న్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వానికి ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా స‌మ‌యంలో జీహెచ్ఎంసీ సేవ‌లు మ‌రువ‌లేనివి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో అన్న‌పూర్ణ క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీర్చాయ‌ని ఎమ్మెల్యే ఓవైసీ స్ప‌ష్టం చేశారు.


logo