గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:26

59కే ‘ఫావివిర్‌' గోలి

59కే ‘ఫావివిర్‌' గోలి

  • ఫావిపిరవిర్‌కు హెటిరో జెనరిక్‌ వెర్షన్‌ విడుదల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో ల్యాబ్స్‌ ‘ఫావివిర్‌' పేరుతో ట్యాబ్లెట్లను విడుదలచేసింది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.59గా పేర్కొన్నది. ఇవి అన్ని మెడికల్‌ షాపుల్లో అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ మీద మాత్రమే దీనిని విక్రయిస్తారన్నది. కొవిడ్‌ బాధితులు కోలుకోవడంలో యాంటీవైరల్‌ డ్రగ్‌ ఫావిపిరవిర్‌ సమర్థంగా పనిచేస్తున్నదని ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో దీనికి జెనరిక్‌ వెర్షన్‌గా హెటిరో.. ఫావివిర్‌ను ఆవిష్కరించింది. దీని తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని హెటిరో సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ ఇప్పటికే కోవిఫర్‌ పేరుతో రెమ్‌డెసివిర్‌ జెనరిక్‌ వెర్షన్‌ను విడుదలచేసింది.logo