మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 18:03:47

హైదరాబాద్‌ వైద్యుల చరిత్ర.. కరోనా బాధితుడికి డబుల్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

హైదరాబాద్‌ వైద్యుల చరిత్ర.. కరోనా బాధితుడికి డబుల్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో వైద్యులు కరోనా సోకిన రోగికి దేశంలో మొట్ట మొదటిసారిగా డబుల్ లంగ్ ప్లాంటేష‌న్ విజయవంతంగా పూర్తి పూర్తి చేశారు. ఆరు వారాల నిశిత పర్యవేక్షణ, రికవరీ అనంతరం శుక్రవారం రోగిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. చేశారు. దేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలో అనుభవం ఉన్న డాక్టర్‌ సందీప్‌ అత్వార్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ప్రమాదకరమైన, సంక్లిష్టమైన శస్త్ర చికిత్స చేసింది. ఛండీగఢ్‌కు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి రోగి సార్కోయిడోసిస్‌తో బాధపడుతున్నాడు. ఇది అతని ఊపిరితిత్తులపై ప్రభావం చూపింది. ఇది చివరికి ఫైబ్రోసిస్ ఏర్పడటానికి దారి తీసింది. ఇది అతని శ్వాసపై ప్రభావం చూపడంతో ఆపరేషన్‌ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సందీప్ అత్వార్ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా క‌రోనా సోకిన బాధితుడికి విజ‌య‌వంతంగా డ‌బుల్ లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేసిన‌ట్లు చెప్పారు. స‌ర్కోయిడోసిస్‌తో బాధపడుతున్న బాధితుడికి నిమిషానికి 15 నుంచి 50 లీట‌ర్ల ఆక్సిజ‌న్‌ను 8 వారాల పాటు అందించామ‌న్నారు. అనంత‌రం లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేశామ‌ని డాక్టర్‌ ప్రస్తుతం అత‌ని ఆరోగ్యం బాగుంద‌ని వైద్యుడు సందీప్‌ తెలిపారు. ఈ ప్రక్రియ సంక్లిష్టమైందని, డిశ్చార్జ్ అనంతరం అతనికి కనీసం ఆరు వారాల పాటు నిశిత పర్యవేక్షణ, బయో బబుల్ వాతావరణం, జాగ్రత్తగా మందులు వాడాల్సిన అవసరం అవుతుందని డాక్టర్‌ అత్వార్‌ వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo