శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 20:44:22

రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్‌ అభివృద్ధి..

రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్‌ అభివృద్ధి..

హైదరాబాద్‌: పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ ఏర్పడింది. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకున్నాం. రాష్ట్రంలో పట్టణ జనాభా 44 శాతం ఉంది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నాం. కొత్త పురపాలక చట్టంలో జవాబుదారీ తనాన్ని పెంచాం. నూతన మున్సిపల్‌ చట్టంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు. టీఎస్‌ఐపాస్‌ స్ఫూర్తితో టీఎస్‌బీపాస్‌ను తీసుకొస్తున్నం. ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీపాస్‌ ప్రారంభిస్తం. టీఎస్‌బీపాస్‌ ద్వారా సులువుగా భవన నిర్మాణాలు టీఎస్‌బీపాస్‌ అమలులో సమస్యలు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

పురపాలక విభాగానికి ఈ బడ్జెట్‌లో రూ.12,282 కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో పురపాలక శాఖకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. పారిశుధ్యం, హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో పట్టణప్రగతి చేపట్టాం. పట్టణప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. పట్టణప్రగతిని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

హైదరాబాద్‌ ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా ఉందని,  హైదరాబాద్‌ కోసం బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మిషన్‌ హైదరాబాద్‌ ్రప్రణాళికతో రాబోయే ఐదేళ్లలో విశ్వనగరంగా తీర్చిదిద్దుతం. శివారు ప్రాంతాలకు మంచినీరు అందేలా చేశాం. హైదరాబాద్‌ మాస్టర్‌ సీవరేజ్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నాం. వరుసగా ఐదేళ్లుగా దేశంలోనే హైదరాబాద్‌ అతున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా నిలిచింది. ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో హైదరాబాద్‌ అభివృద్ధి చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మిషన్‌ భగీరథ నీళ్లు అందిస్తున్నం. హైదరాబాద్‌ మెట్రోను ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తం. ఐటీ కారిడార్‌కు ట్రామ్స్‌ను తీసుకొస్తం. 40 మల్టీ లెవల్‌ పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తమని స్పష్టం చేశారు. 
logo