హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం

మేడ్చల్ మల్కాజిగిరి : పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రేటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, టీచర్స్ కాలనీ, చర్లపల్లి, మారుతినగర్ తదితర ప్రాంతాలలో టీఆర్ఎస్ అభ్యర్థి బొంతు శ్రీదేవి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కేటీఆర్ రోడ్డుషో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో కొట్లాది నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని, సంక్షేమం, చేసిన అభివృద్ధి చూసి టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కానీ హామిలను గుప్పిస్తున్నారని, వరద బాధితుల సహాయం పదివేలు నిలిపివేసిన ఘనత బీజేపీ, కాంగ్రెస్ నాయకులనేదన్నారు. గ్రేటర్ ఎన్నికల అనంతరం బాధితులకు వరద సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ బోగస్ పార్టీలని గ్రేటర్ ఎన్నికల్లో ఓటు ద్వార సరైన విధంగా బుద్ది చేప్పాలని, బీజేపీ సోషల్ మీడియాలో బోగస్ ప్రచార చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు.
బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు మల్లేశ్ వంశరాజ్, పాండాల శివకుమార్‌గౌడ్, నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎస్కే.కరీం, దుర్గా, రాఘవరెడ్డి, రఘు, నర్సింహ్మగౌడ్, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, నర్సింహ్మలతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ